29 August, 2026 | 12:37 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

బాలెన్‌షాకు జెన్‌జీ సెగ

15-07-2026 01:44 AM

నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే వ్యతిరేకత

బైక్ రైడర్ ఆత్మహత్యపై భగ్గుమన్న యువత

ఖాఠ్మాండు, జూలై ౧౪: జెన్‌జీ తరం మద్దతుతో నేపాల్ ప్రధాని అధిరోహించిన బాలెన్ షా, పట్టుమని నాలుగు నెలలైనా గడువముందే తిరిగి జెన్‌జీ తరం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. దేశ రాజధాని ఖాఠ్మాండులో బైక్ పార్కింగ్ విషయంలో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానైంది.

నో-పార్కింగ్ జోన్‌లో గణేష్ అనే బైక్ రైడర్ తన వాహనాన్ని నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు తాళం వేశారు. దీంంతో సదరు రైడర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షతగాత్రున్ని అక్కడి యంత్రాంగం న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా, మరుసటి రోజే మరణించాడు. గిగ్ వర్కర్ మృతి అంశం నేపాల్‌లో పెద్ద దుమారానికి తెరలేపింది. జెన్‌జీ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఎంపీ బసనా థాపా మాట్లాడుతూ.. ఒక యువకుడు యంత్రాంగం వేధింపులకు బలైపోతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని మండి పడ్డారు.

తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నేరస్థుడిలా లాక్కెళ్లారే తప్ప ఆంబులెన్స్ పిలవలేదని ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ విష్ణు బహదూర్ కూడా ప్రధాని బాలెన్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్ల అద్దాలు తీసి ప్రధాని ప్రజల కష్టాలను చూడాలని ప్రతిపక్షానికి చెందిన ఓ ఎంపీ ఎద్దేవా చేయగా.. మరికొందరు ప్రధాని తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యంత్రాంగం ప్రజలను పీడిస్తున్నదని, వారిపై అపరాధ రుసుములు, జరిమానాలు విధించడం దారు ణమని మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలపై హోమంత్రి స్పందించారు. రైడర్ మృతికి కారణమైన ముగ్గురు ట్రాఫిక్ పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశించారు.