హసరంగ స్థానంలో జార్జ్ లిండే
ముంబై, ఏప్రిల్ 10: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక మిస్టరీ స్పి న్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2026 సంద ర్భంగా హసరంగ కండరాల గాయానికి గురయ్యాడు. ఇప్పటికీ కోలుకోకపోవడంతో లక్నో ఫ్రాంచైజీ అతడిని ఈ సీజన్ వరకు పక్కన పెట్టాలని నిర్ణయించింది.
దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేను జట్టులోకి తీసుకుంది. లిండే ఐపీఎల్‌కు ఎంపికవడం ఇదే తొలిసారి. 34 ఏళ్ల జార్జ్ లిండే దక్షిణాఫ్రికా తర ఫున 3 టెస్టులు, 4 వన్డేలు, 37 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్ వేలంలో రూ.కోటి బేస్ ప్రైజ్‌తో వచ్చినప్పటికీ.. అతడిని ఎవ రూ కొనుగోలు చేయలేదు.
కానీ ఇప్పుడు లక్నో జట్టులో స్థానం దక్కించుకోవడం అతడికి పెద్ద అవకాశంగా మారింది. ఐపీఎల్ ఆడకున్నా ఫ్రాంచైజీ క్రికెట్‌లో లిండేకు మంచి అనుభవం ఉంది. ఎస్‌ఏ టీ20, మేజర్ లీగ్ క్రికెట్‌లో ముంబై ఫ్రాంచైజీకి లిండే ప్రాతినిధ్యం వహించాడు. హసరంగ దూరం కావడం లక్నో జట్టుకు లోటే అయినా, లిండే అనుభవం ఉపయోగపడనుంది. లక్నో సూ పర్ జెయింట్స్ జట్టు ఆడిన మూడు మ్యా చుల్లో రెండు మ్యాచులలో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.




