11 April, 2026 | 3:38 AM

చెన్నై గెలుపు ఖాతా తెరిచేనా?

11-04-2026 01:27 AM

చెపాక్ వేదికగా ఢిల్లీతో పోరు

సంజూపైనే ఫోకస్

తుది జట్టులోకి బ్రెవిస్

చెన్నై, ఏప్రిల్ 10: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టు తొలి విజయాన్ని రుచి చూడలేదు. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క ఆటగాడు రాణించడం లేదు.

ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న సంజూ శాంసన్ ఫ్లాప్ అవుతున్నాడు. మూడు మ్యాచ్ లలోనూ నిరాశపరిచిన సంజూ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లోనైనా రాణిస్తాడేమో చూడాలి. ధోనీ లేకపోవడం కూడా చెన్నైకి ఇబ్బందిగా మారిం ది. అయితే గాయంతో గత మూడు మ్యాచ్ లకూ దూరమైన బ్రెవిస్ జట్టులోకి తిరిగి రా వడం చెన్నైకి ఊరటగా చెప్పొచ్చు.

ఎందుకంటే సీఎస్కే బ్యాటింగ్ లైనప్ లో సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్ తప్పిస్తే మిగిలిన వారం తా విఫలమవుతున్నారు. చెన్నై బ్యాటింగ్ గాడిన పడితే తప్ప తొలి విజయం అందడం కష్టమే. బౌలింగ్ పరంగానూ సీఎస్కే ఒత్తిడిలో ఉంది. ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ , నూర్ అహ్మద్ లాంటి వారున్నా స్థాయికి తగినట్టు రాణించడం లేదు. హోం గ్రౌండ్ లో చెన్నై బౌలర్లు పుంజుకుంటారేమో చూడాలి. 

తుది జట్లు అంచనా 

చెన్నై: సంజూ (కీపర్), రుతురాజ్ (కెప్టెన్), ఆయుశ్, బ్రెవిస్, దూబే, ప్రశాంత్ వీర్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్నీ, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ: కెఎల్ రాహుల్(కీపర్), నిస్సాంక, నితీశ్, స్టబ్స్, మిల్లర్, అక్షర్(కెప్టెన్), విప్రజ్, కుల్దీప్, ఎంగిడి, నటరాజన్, ముకేశ్ కుమార్