23 June, 2026 | 5:21 PM

Breaking News

రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •  

స్విమ్మింగ్‌తో ఫిట్‌గా!

06-04-2025 12:00 AM

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటికి బదులు అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేస్తే శరీరం మరింత ఫిట్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే స్విమ్మింగ్ వల్ల అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ప్రతిరోజు ఉదయం కాసేపు స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చు అయ్యి కొవ్వు తొలగిపో తుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్నవారు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఎముకలు బలంగా తయారవుతాయి. 

రోజూ ఈత కొట్టే వారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు తక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. ఈత వల్ల కండరాలు బలంగా మారి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. 

నిద్రలేమితో బాధపడేవారు రోజూ కాసేపు స్విమ్మింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

రోజూ ఈత కొట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి. మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు.