రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్
23-06-2026 05:19 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలో రెవిన్యూ తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం కార్యాలయానికి వెళ్లిన ఆయన హాజరు పట్టిక భూ రికార్డులు సాదా బైనమా తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.






