5 May, 2026 | 11:22 AM

ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి

07-09-2025 12:00 AM

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, కార్తీక్ ఆర్యన్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ’. సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో ఈ సినిమాను ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, షరీన్, భూమిక తివారీ, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. నీనా గుప్తా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

అయితే, కథానాయకి అనన్య పాండే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్‌ను పంచుకుంది. ఇన్‌స్టా వేదికగా పెట్టిన ఈ పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. “తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరా’ షూటింగ్ పూర్తయింది. దీంతో మరుపురాని, సరదాలతో నిండిన, సూపర్ రోలర్ రైడ్ 57 రోజుల ప్రయాణం ముగిసింది. మా టీమ్ లేకుండా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. నాకు ఇష్టమైన షరీన్ మంత్రి, అరోరా కిషోర్ ఎనర్జీలు ప్రధానమైనవి.

అందుకే కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అదార్ పూర్ణావాలా ఈ ప్రాజెక్టును మరింత ప్రత్యేకంగా చేశారు. అద్భుతమైన కోస్టార్‌గా ఉన్నందుకు నా ప్రియమైన కార్తీక్ ఆర్యన్‌కు ధన్యవాదాలు. ఇందులో మీరు చేసిన పాత్రను మరెవరూ చేయలేరు. మీతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. పెద్ద తెరపై వారి మాయాజాలాన్ని చూడటానికి వేచి ఉండండి.

కరణ్ శర్మకు ప్రత్యేక ధన్యావాదాలు. సినిమా విడుదలైన తర్వాత అతను అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటానుకుంటున్నా. మన ప్రపంచాన్ని అవిశ్రాంతంగా సజీవంగా తీసుకొచ్చి, రాత్రీపగలు అని తేడా లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరందరూ నవ్వడానికి, ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి. నేను వేచి ఉండలేను. థియేటర్లలో కలుద్దాం” అని రాసుకొచ్చింది.