చిన్న సినిమాల విషయంలో అలాంటి నిర్ణయమే మంచిది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
* డైరెక్టర్ కౌశిక్ ఈ కథను గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. జూలై నుంచి షూటింగ్ మొదలుపెట్టాం. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథ ఇది. చాలా యూనిక్‌గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండిటి బ్లెండ్‌తో చాలా కొత్త కథ చెప్పారు దర్శకుడు. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్ దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్‌ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదు.
* ఒక కథ విన్నప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, ఇలాంటి పాయింట్ ఇప్పటివరకు రాలేదనిపిస్తే అలంటి పాయింట్‌తో సినిమా చేయాలనే ఆసక్తి కలుగుతుంది. కమర్షియల్, ఫ్యామిలీ కథలకు కాంబినేషన్ చూస్తాం గానీ ‘కిష్కింధపురి’లాంటి కథకు మాత్రం యూనిక్ పాయింట్ ఎమిటని చూస్తాం. కిష్కింధపురి అనే ఒక ఊరిలో జరిగే కథ ఇది. అలా ఈ సినిమాకు టైటిల్ పెట్టాం.
* బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు కమర్షియల్ మాస్ సినిమాలు చేశారు.
ఈ సినిమాలో ఆయన నటన చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో రెండు యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్‌గా మలుపు తిరుగుతుంది.
* కార్మికుల సమ్మె కారణంగా మా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాపై 15 రోజుల షూటింగ్ ఎఫెక్ట్ అయింది. అయితే ఆర్టిస్టులందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కొత్త షెడ్యూల్ మొదలైపోయింది. నవంబర్ 15కు సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుంది. సంక్రాంతికి సినిమా వచ్చేస్తుంది.
* మేము పెద్ద సినిమాలే చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బడ్జెట్‌లో అవుతాయని తెలిస్తేనే చేయడం ఎవరికైనా మంచిది.
* సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగు తుంది. ప్రేక్షకులు తప్పకుండా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. విజువల్, మ్యూజికల్‌గా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. చాలా షాక్ ఫ్యాక్టర్స్, ప్రేక్షకులు భయపడే మూమెంట్స్ చాలా ఉన్నాయి.
* అనుపమ పరమేశ్వరన్‌కు ఎప్పటినుంచో ఇలాంటి హారర్ కంటెంట్ చేయాలని ఉండేది. ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ తనే. కథ వినగానే ఓకే చెప్పారు. తనకు ఈ సినిమా లో మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ దొరికింది. తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది.






