17 May, 2026 | 11:44 AM

చివరి దశకు చేరిన బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరి

17-05-2026 10:43 AM

బోథ్(విజయక్రాంతి): బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల మధ్యన కొనసాగిన ఆదిపత్య పోరు లో చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండి జెండా మోసిన వ్యక్తికి పదవిని కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిల మధ్య వారి అనుచరులకు చైర్మన్ పదవిని కట్టబెట్టాలని తీవ్రంగా కృషి చేశారు. అయితే బి ఆర్ ఎస్ పార్టీ నుండి గత రెండు సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారి పేర్లను ఓ నాయకుడు జిల్లా ఇన్చార్జి మంత్రి ముందు ప్రతిపాదించగా, డిసిసి అధ్యక్షుని వర్గం వారు పార్టీ మారకుండా ఉన్నవారికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీంతో జిల్లా ఇన్చార్జి మంత్రి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అభ్యర్థి ఎంపిక జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్లో కల్లోలం మండల కన్వీనర్ నియామకం జరిగిన తర్వాత కన్వీనర్ నియామకంలో వలస వచ్చిన వారికి పార్టీకి పనిచేయని వారికి పదవులు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వర్గం వారు ఆందోళనకు దిగారు. దీంతో అధిష్టానం కన్వీనర్ ల నియామకం పైన బ్రేక్ వేసింది. కన్వీనర్ నియామకపు జాబితా లో ప్రకటించిన వారి పేర్లు నిలిపివేయడం జరిగిందని త్వరలోనే మరో జాబితా విడుదల చేస్తామని అంతవరకు ఆగాలని నియోజకవర్గ ఇన్చార్జి. ఆడే గజేందర్  పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి.