ఊయలే.. ఉరితాడు అయిందా చిట్టి తల్లి
ఆడుకుంటున్న ఉయ్యాలలో...
చీర మెడకు చుట్టికొని బాలిక మృతి
ఎల్లారెడ్డి గూడలో విషాదం... కుటుంబ సభ్యుల రోదనలు
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆడుకుంటున్న ఊయలే.... చిన్నారి మెడకు ఉరి తాడై చీర చుట్టుకుని మరణించిన విషాద ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదయ్య తెలిపిన కథనం ప్రకారం... ఎల్లారెడ్డి గూడలో నవనీత, భర్త ఇద్దరు కూతుళ్లు పవిత్ర (8)ఆరాధ్య( 7 నెలలు) తో కలిసినివసిస్తున్నారు. గత కొంతకాలంగా భర్తతో విభేదాల కారణంగా నవనీత వేరుగా ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈనెల 2వ తేదీన సాయంత్రం చిన్న కూతురు కోసం కట్టిన ఊయలలో పెద్దకూతురు పవిత్ర ఆడుకుంటుండగా నవనీత కూలి చేసిన డబ్బులు తీసుకొని రావడానికి దగ్గర్లోను ఓ ఇంటికి వెళ్ళింది.వెంటనే తిరిగి వచ్చే లోపు పవిత్ర ఉయ్యాలలో విగత జీవిగా కనిపించింది. వెంటనే కిందికి దించి దగ్గర్లోని ప్రైవేట్ దావకానకు తరలించగా అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పవిత్ర ఉయ్యాలలో ఆడుకుంటుండగా చీర చుట్టుకొని చనిపోయి ఉండొచ్చునని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లి నవనీత పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




