14 May, 2026 | 3:11 AM

అమ్మాయిలదే హవా

14-05-2026 01:57 AM

సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల

మొత్తంగా  85.20 శాతం ఉత్తీర్ణత

88.6 శాతం బాలికలు, 82.13 శాతం బాలుర ఉత్తీర్ణత

గతేడాది కంటే 3 శాతం తగ్గిన పాస్ పర్సెంటేజీ

న్యూ ఢిల్లీ, మే 13: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం ఫలితాలను విడుదల చేసింది. 85.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3 శాతం తగ్గింది. బాలికల్లో 88.6 శాతం, బాలురలో 82.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల మందికిపైగా విద్యార్థులు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు.

17,113వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు, 94,028 వేల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. ఈసారి దక్షిణాది నగరాల్లో ఫలితాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. బాలురకంటే బాలికలు 6.73 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచారు. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు పరీక్షలను నిర్వహించారు.