11-02-2026 01:09:04 AM
కాంగ్రెస్ అధిష్ఠానానికి 80 మంది ఎమ్మెల్యేల విజ్ఞప్తి
బెంగళూరు, ఫిబ్రవరి 10 : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని సుమారు 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారని, ఇప్పుడు ఆ నిర్ణయం పార్టీ పెద్దల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే ఇక్బాల్ తెలిపారు.
తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందుకు తగినట్లుగా వ్యవహరించాలని సూచించారు. సిద్ధరామయ్య తన తండ్రికి అనుకూలం గా పదేపదే మాట్లాడటం ఇబ్బందిగా మారిందన్నారు. ఆయన తన వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడటం సరికాదన్నారు. డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలనేది మా అందరి కోరిక, దాని గురించి పదేపదే బహిరంగంగా ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించకూడదని ఇక్బాల్ అన్నారు. మరోవైపు డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది.