31 July, 2026 | 9:46 PM

రొటీన్ గా మున్సిపల్ సమావేశం

31-07-2026 09:13 PM

- పలు అంశాలు ఆమోదం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మున్సిపల్ పురపాలక సంఘం సమావేశం రొటీన్ గానే ముగిసింది. మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ హల్లో జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం సదా సిదాగా జరిగింది. పలు అభివృద్ధి అంశాలను సభ్యులు ఆమోదంచారు. ఎజెండాలోని 20 అంశాలకు గాను 18 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. ఎప్పటిలాగే మున్సిపల్ సమావేశం మొక్కుబడి తంతుగా సాగింది. ఆమోదాల కోసమే ఈ సమావేశం నిర్వహించినట్టుగా సభ్యులు వాపోయారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ ఆమోదించిన అంశాల ఇలా ఉన్నాయి.

ఆమోదించిన అంశాలు..

1. ఇంజనీరింగ్ విభాగం, బెల్లంపల్లి పురపాలక సంఘంలో వివిధ వార్డులలో త్రాగు నీటి నిర్వహణ, లీకేజీల మరమ్మత్తులు పంపు సెట్ల మరమ్మత్తు పనులకు రూ.1,23,630.00లు ఖర్చు చేసిన బిల్లు ను మున్సిపల్ సాధారణ / వాటర్ సప్లై నిధుల నుండి ఖర్చు చేయుటకు ఆమోదంతెలిపారు.

2. వివిధ వార్డులలో 'వీధి దీపాల వైరింగ్, టిప్స్ ఇతర ఎలక్ట్రికల్ మెటీరియల్తో అత్యవసర మరమ్మత్తులు పూర్తి చేశారు.  రూ.1,06,050/- లు  బిల్లు ను మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఖర్చు చేయడానికి కౌన్సిల్ ఆమోదం  తెలిపింది.

3. పలు వార్డులలో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయుటకు  మరమ్మత్తులకు గురైన దీపాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయుటకు గాను రూ.1.00 లక్షను మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఖర్చు చేయదడానికి ఆమోదం లభించింది.

4. పురపాలక సంఘ కార్యాలయములో అధికారులు, సిబ్బంది సమావేశములు జరుపుటకు 50 కుర్చీలు కొనుగోలు చేయుటకు గాను రూ.25,000/ లను మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఖర్చు చేయుటకు గాను ఆమోదం తెలిపారు.

5. బెల్లంపల్లి పట్టణములో వర్షాకాలం దృష్ట్యా వార్డులలో ఈగలు దోమల వలన ప్రజలకు ఆరోగ్య దృష్ట్యా ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి వివిధ వార్డులలో  మురికి కాలువలల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లుటకు గాను బ్లీచింగ్ పౌడర్ను కొనుగోలు కు ప్రవేశ పెట్టిన రూ.లు 50,000/-లకు సభ్యులు ఆమోదం తెలిపారు.

6. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను వార్డు నెం. 1 నుండి 17 వార్డులలో సమర్ధవంతంగా నిర్వహించడానికి అదనంగా 05 మంది కార్మికులను రోజువారి కూలి పద్దతిన 6 నెలల పాటు తీసుకొనుటకు ఆమోదం జరిగింది.

7. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను వార్డు నెం. 18 నుండి 34 వార్డులలో సమర్ధవంతంగా నిర్వహించుట కొరకు అదనంగా 05 మంది కార్మికులను రోజువారి కూలి పద్దతిన 6 నెలల పాటు తీసుకొనుటకు ఆమోదించారు.

8. బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆగస్టు 15, 2026న జరుపుకొన బోయే వేడుకల స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు చర్యలలో భాగంగా లడ్డు, బూంది, మిక్సర్ తదితర వాటి కొనుగోలు  ఇతర సంబంధిత ఖర్చుల నిమిత్తం రూ.20,000/- (రూపాయలు ఇరవై వేల మాత్రమే) ముందస్తుగా మంజూరు ను  సభ్యులు  అంగీకరించారు.

9. బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డులలో మురికి కాలువలను శుభ్రం చేయడం, వార్డులలో కలుపు మొక్కలను తొలగించదడానికి గాను అవసరమగు పనిముట్లు కొనుగోలు కు రూ.లు 50,000/-లకు ఆమోదం తెలిపారు.

10. బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ అంబేద్కర్ విగ్రహం దారిలో ప్రజల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న గోడను కూల్చివేయుటకు అంచనా వ్యయం  ప్రతిపాదన  రూ.1,00,000/-  ఆమోదం తెలిపారు.

11. బెల్లంపల్లి బజార్ ప్రాంతంలో ఉన్న 165 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దుకాణాలకు ఆస్తి పన్నులు చెల్లించకపోవడం వలన మున్సిపాలిటీకి రావలసిన రెవెన్యూ సమకూరకపోవడం, విచారణాధికారులచే విదారణ నిర్వహించబడిన నేపథ్యములో దుకాణాలను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి నుండి బెల్లంపల్లి మున్సిపాలిటీకి అప్పగించడానికి ఆమోదం తెలిపారు.

12. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో గల సుభాష్నగర్, బుడిదగడ్డ బస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటు కొరకు తీర్మాణం చేశారు. ఈ మేరకు తీర్మాణం లేఖ ను DM&HO కు  పంపించాలని నిర్ణయించారు.

13. టెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని నివాస గృహాల ఇంటి నంబర్ల నమోదు (రిజిస్ట్రేషన్) ప్రక్రియలో ఏర్పడిన జాప్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నివారణకు చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మాణం చేశారు.

14. మునిప్సల్ కార్యాలయం లో వివిధ విభాగాల కంప్యూటర్ రిపేరింగ్స్, ప్రింటర్ క్యాట్రిడ్జ్ రీఫిల్లింగ్ కొరకు 3 మాసములు అనగా (ఆగష్టు 2026 నుండి అక్టోబర్ 2026) వరకు 3 మాసములకు అగు అంచనా వ్యయం రూ.30,000/-లకు ఆమోదం తెలిపారు.

15. బెల్లంపల్లి, పరిపాలనా విభాగం, జులై 2026 మాసానికి సంబంధించిన స్టేషనరీ వస్తువుల కొనుగోలు కొరకు,  ఖర్చు రూ. 30,000/- కాగా ఇట్టి స్టేషనరీ కొనుగోలు ను ఆమోదం తెలిపారు.

16. తేది 23.07.2026న  కౌన్సిలర్లకు గచ్చిబౌలి, హైదరాబాదు ఇ.యస్.సి.ఐ., ఇంజనీరింగ్ కాలేజిలో అవగాహన ఏర్పాటు చేసిన సదస్సు వాహన, ఇతరాత్ర వాటికి అయిన ఖర్చు రూ. 35,000/- ఆమోదం తెలిపారు.

17. గాంధీ చౌరస్తా నుండి ఎం.పి.డి.ఓ. చౌరస్తా వరకు ప్రతిపాదించిన 80 అడుగుల రోడ్డు విస్తరణ  రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు (Road Development Plan) కోసం వివరణాత్మక సర్వే  డ్రాయింగ్ల తయారి కొరకు ముందస్తు అంచనా వ్యయం రూ. 99,000/- లకు ఆమోదం తెలిపారు. 

18. ఎండాకాలం దృష్ట్యా అకౌంట్స్ విభాగములో ఒక కూలర్ అత్యవసరముగా రూ. 4,000/-లతో  కొనుగోలు చేసిన దానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ ,కమిషనర్ తన్నీరు రమేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.