31 July, 2026 | 10:06 PM

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

31-07-2026 09:19 PM

- 62 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ఆర్మూర్,(విజయక్రాంతి): మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి  ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో,  ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి  క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.10 అడుగులకు 23.49 టీఎంసీల నీరు నిలువ ఉంది.

గత ఏడాది ఇదే రోజున 1078.20 గాను 39.40 టిఎంసిల నీరు నిలువ ఉండింది. ప్రాజెక్టులోకి సుమారు 62 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చి చేరుతోంది.  ప్రాజెక్టు నుంచి 822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 291 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231  క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.