క్లాస్ మెట్ కుటుంబానికి రూ.50 వేలు అందజేత
15-06-2025 05:49 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గూడూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో పది రోజుల క్రితం మరణించిన ఏదుల ఆదినారాయణతో కలిసి చదువుకున్న 1991-92 టెన్త్ బ్యాచ్ మిత్రులు ఆయన దశదినకర్మకు హాజరై వారి కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఆదినారాయణ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో కొనకంచి నాగమల్లేశ్వరరావు, కోరే పాపయ్య, బత్తుల లక్ష్మణ్, మేడి మల్లేష్, నేరెళ్ల వేమన, పింగిలి సాయిరెడ్డి, నూకల ఉపేందర్, కుండే కిషన్, చిన్నబోయిన లక్ష్మణ్, సదువాల వీరస్వామి, పొన్నం మల్లేష్, బొమ్మ గాని సాంబయ్య, తండ యాకాంబరం, ఈసం రమేష్, చుంచా బాలయ్య, మరుపాల వీరస్వామి పాల్గొన్నారు.






