రైతు నేస్తం కార్యక్రమమును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి
15-06-2025 | 05:52pm
మర్రిగూడ మండల వ్యవసాయ అధికారి సాహస్..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): జూన్ 16న సాయంత్రం నాలుగు గంటలకు మర్రిగూడ మండల పరిధిలోని రైతు వేదికలలో "రైతు నేస్తం" కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజన్ 2025 రైతు భరోసాను ప్రారంభించనున్నట్లు మర్రిగూడ మండల వ్యవసాయ అధికారి సాహస్(Mandal Agriculture Officer Sahas) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన అన్నారు. మన మండలంలో మర్రిగూడ రైతు వేదిక, దామర భీమనపల్లి రైతు వేదిక, యర్రగండ్లపల్లి రైతు వేదికలలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.






