జీవో 97ని తక్షణమే రద్దు చేయాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేటటువంటి జీవో 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ములకలపల్లి మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ పార్టీ యువజన, విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.
జీవో నెంబర్ 97 కారణంగా విద్యార్థుల విద్యా భవిష్యత్తు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే పరిస్థితి ఉందని యువజన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని, చదువుకునే యువత జీవితాలను అయోమయంలోకి నెట్టొద్దని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, జీవో నెంబర్ 97 రద్దు చేసే వరకు విద్యార్థుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని నాయకులు హెచ్చరించారు.






