22 August, 2026 | 7:36 PM

అథ్లెటిక్స్‌లో దోమకొండ గురుకుల విద్యార్థిని ప్రతిభ

22-08-2026 07:05 PM

డిస్కస్‌ త్రోలో ప్రథమ స్థానం.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్. నిహారిక ఎంపిక

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన ఎస్. నిహారిక డిస్కస్ త్రో విభాగంలో ప్రథమ స్థానం సాధించి సత్తా చాటింది.

ఆమె ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ఈ నెల 26న హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నిహారికను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య సుధా, ఎస్‌వీపీ మీనాక్షి, జేవీపీ కవిత, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీలత, రమ్య నిహారికను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, దోమకొండకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.