12 May, 2026 | 1:22 AM

జీవో 7ను రద్దు చేయాలి

12-05-2026 12:00 AM
  1. ప్రవేట్ విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తున్న సర్కార్
  2. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు
  3. సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి వేదన శిబిరం  

ఎల్బీనగర్, మే 11(విజయక్రాంతి) : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లు విడుదల చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం జీవో 7 ను విడుదల చేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు ఆవేదన వ్యక్తం చేసారు. సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎల్బీనగర్ లోని మహనీయుల కూడలి వద్ద విద్యార్థి వేదన దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ చె ల్లించకుండా విద్యార్థులకు ప్రత్యక్షంగా ఫీజు లు పంపిస్తామని తీసుకు వచ్చిన జీవో 7ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులందరూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలుగా ఉండడం వల్ల రాష్ట్రంలో ప్రైవేటు విద్యారంగాన్ని ప్రో త్సహిస్తూ పేద మద్దతు తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేయకపోవడం ఆంతర్యం ఏ మిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులతో చెలగాటపడుతు న్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయ పార్టీలతోటే బహుజనులకు న్యాయం జరుగుతుందని వివరించారు.

సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు మాట్లాడుతూ 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు బిల్లులు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు గా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెం ట్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్రై వేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభు త్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కేవీ గౌడ్, ఉ పాధ్యక్షుడు బోయిని రాఘవేంద్ర ముదిరాజ్, కార్యదర్శి బాలస్వామి, విద్యార్థి యువ జన విభాగం వర్కింగ్ సర్దార్ శీను, రమేష్, గౌరీ శంకర్, తెలంగాణ రక్షణ వేదిక అధ్యక్షులు చింతల విజయ్‌లతో పాటుఈ దీక్షకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షే మ సంఘం అధ్యక్షుడు కాసం సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు వైరు శేఖర్, ఆయిలి వెంకన్నగౌడ్, బీసీ ఉద్యమ నాయకులు రాయబండి పాండు రంగాచారి, కార్పొరేట్ విద్య నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు, తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్‌గౌడ్, నక్క మహేష్‌యాదవ్, బీసీ ఇంట లెక్చువల్ ఫోరం సభ్యులు లింగేష్ యాదవ్, బీసీ ప్రభంజనం కన్వీనర్లు ఉప్పు సత్యనారాయణ, రాధాకిషన్, తెలంగాణ వెంక న్న, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు ఐలివెంకన్నగౌ డ్, బైరు శేఖర్ గంగపుత్ర పాల్గొన్నారు.