బోధనతో నాణ్యమైన విద్య
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
చేగుంట, మే 11 :99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఐఎఫ్ పిఎస్ /ఐడిపిఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది అనే కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో, ఈ ఐఎఫ్ పిఎస్ , ఐడిపిఎస్, బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో - చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఇంచార్జి ప్రిన్సిపాల్ స్వర్ణలత, లెక్చరర్స్ శ్యాంసుందర్, అరవింద్ రెడ్డి, వెంకటేశ్వర్లు,ప్రమోద్ కుమార్, కంప్యూటర్ అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






