ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, వందేమాతరం గీతాలాపన అనంతరం జనగణమనతో జెండా వందనం చేశారు. అదే విధంగా మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ దొంత అంజలి, పోలీస్ స్టేషన్ లో సీఐ రమణ మూర్తి, న్యాయస్థానంలో న్యాయమూర్తి సాయి కిరణ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఏం భూమక్క, వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏఓ శ్రీకాంత్, ఏంపీడీఓ కార్యాలయంలో మధుసూదన్, ఏంఈఓ శైలజ, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ సంతోష్ మహాత్మ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, ఐక్య వ్యాపార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు మైలారపు సుధాకర్, పలు గ్రామాల్లో సర్పంచ్ లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురవేసి వందనం చేశారు. పట్టణంలో విద్యార్థులు నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.






