అధ్వానంగా మారిన గోకారం-నేలపట్ల రోడ్డు
పట్టించుకోని అధికారులు..
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని గోకారం గ్రామం నుండి చౌటుప్పల్ మండలం(Choutuppal Mandal)లోని నేలపట్లకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమై అధ్వానంగా మారింది. గోకారం గ్రామం నుండి చౌటుప్పల్ కు వెళ్లేందుకు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా మరమ్మత్తులకు నోచుకోలేదని తాజా వర్షాలతో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు నరకం కనిపిస్తుందని అధికారులు ఈ రోడ్డును పట్టించుకోవడంలేదని గోకారం గ్రామం ప్రజలు ఆరోపిస్తున్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి గోకారం గ్రామం నుండి వెళ్లేందుకు ఈ రోడ్డుని ఉపయోగించడం జరుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారుల, ప్రజల ఇబ్బందులు తొలగించాలని వారు అధికారులను కోరుతున్నారు.






