15 April, 2026 | 11:08 AM

ఎంపీ రఘురాం రెడ్డి నుండి ఆటో డ్రైవర్ లకు ఖాకీ చొక్కాల పంపిణీ

14-06-2025 04:40 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఆటో డ్రైవర్లకు యూనిఫాం కోసం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) ఆర్థిక తోడ్పాటుతో ఖాకీ చొక్కాలను సిద్ధం చేయించారు. ఈ క్రమంలో నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పలువురు ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ శనివారం పంపిణీ చేశారు. పలు అడ్డాలకు సంబంధించి ఐఎన్ టీయూసీ నుంచి అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలిరాగా వారందరికీ ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు, నగర అధ్యక్షులు నరాల నరేష్ లతో కలిసి కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఖాకీ చొక్కాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ప్రత్యేక చొరవతో ఇస్తున్న వీటిని సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయూసీ నాయకులు పాల్వంచ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు అడ్డాల నుంచి ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.