17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

04-02-2026 12:00 AM

వెండి రూ.20వేలు, పసిడి రూ.6 వేలు పెరుగుదల

హైదరాబాద్‌లో తులం పసిడి రూ.1.56 లక్షలు, కిలో వెండి 2.74 లక్షలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 3: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొన్నిరోజులుగా ధరలు ఆకాశాన్నంటాయి.  మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడ్‌కు కొత్త చైర్మన్ నియామకం, సీఎంఈ మార్జిన్ పెంచడం, గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విలువైన ఈ ధరలు పతనమవుతూ వచ్చి, తాజాగా మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం మధ్యాహ్నం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.56 లక్షలు పలికింది. సోమవారం నాటి ధరతో పోలిస్తే రూ.6 వేలు పెరిగింది. కిలో వెండి ధర రూ.2.74 లక్షలు పలికింది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.20 వేలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 85.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.