03-02-2026 11:07:32 AM
ముంబై: స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2200 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. అమెరికా టారిఫ్ లు తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 700 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. భారత్ పై యూఎస్ సుంకాల తగ్గింపుతో మార్కెట్లు జోష్ కొనసాగుతున్నాయి. భారతదేశంపై అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించిన తర్వాత, మంగళవారం ఉదయం ప్రారంభ వాణిజ్యంలో రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 119 పైసలు బలపడి 90.30కి చేరింది.
18 శాతం సుంకం కథను మారుస్తుందని, భారత్ సాపేక్ష స్థానాన్ని మెరుగుపరుస్తుందని, ఎఫ్ఎల్ఎల్ భాగస్వామ్యానికి తిరిగి తలుపులు తెరుస్తుందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో, రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 90.30 వద్ద ప్రారంభమైంది. ఇది దాని మునుపటి ముగింపు ధర అయిన 91.49తో పోలిస్తే 119 పైసల లాభాన్ని నమోదు చేసింది.