12 March, 2026 | 10:37 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

బంగారం కొత్త రికార్డు

17-10-2024 12:38 AM

రూ.77,890కి చేరిన తులం

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్‌లో బంగారం పరుగులు తీయడంతో దేశీయంగా సైతం ధర పుంజుకున్న ది. రానున్న ధనతెరాస్, దీపావళి నేపథ్యంలో స్థానికంగా డిమాండ్ పెరుగుదల సైతం పుత్తడి జొరుకు కారణమయ్యింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర బుధవారం కొత్త రికార్డుస్థాయి రూ.77,890 వద్దకు చేరింది. అక్టోబ ర్ తొలివారంలో నమోదైన రూ.77,670 ధరను తాజాగా అధిగమించింది. ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర  రూ.71,400 వద్దకు చేరుకున్నది.  ప్రపంచ మార్కెట్లో  ఔన్సు పసిడి ఫ్యూచర్ ధర 22 డాలర్లు పెరిగి 2,682 డాలర్ల వద్ద నిలిచింది.