12 March, 2026 | 8:51 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

వారీ ఎనర్జీస్ ఐపీవో ప్రైస్‌బ్యాండ్ రూ.1,427-1,503

17-10-2024 12:37 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16:  సోలార్ ప్యానల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ వచ్చేవారం జారీచేయనున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రూ.1,427-1,503 ప్రైస్‌బ్యాండ్‌గా నిర్ణయించింది. రూ.4,321 కోట్ల సమీకరణ కోసం వారీ ఎనర్జీస్ ఆఫర్ అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ అక్టోబర్ 18న జరుగుతుంది. ఈ ఐపీవోలో రూ.3,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లనే కంపెనీ జారీచేస్తున్నది.

మరో రూ.721 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లు, ప్రమోటర్లు ఆఫర్ పర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తారు.  ఐపీవో  తాజా ఈక్విటీ జారీచేసిన నిధులతో వారీ ఎనర్జీస్ 6 గిగావాట్ల ఇన్‌గోట్ వాఫెర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటును ఒడిస్సాలో నెలకొల్పుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ల్లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి.