30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులకు బంగారు పతకాలు

11-04-2025 01:21 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 10: స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇంటర్నేషనల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఒలంపియాడ్లో బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రేత్యేక అభినందన సభకు ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ  రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ వలన విద్యార్థులకు చాలా కీలకమైన అంశాలని వారికి విజయాలను అందించడంలో విశేష పాత్ర పోషిస్తుందన్నారు. 

సిల్వర్జోన్ ఫౌండేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ పోటీలలో అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన యల్. రామన్, 7వ తరగతి బంగారు పతకం, యం. శివేన్రెడ్డి, 8వ తరగతి, రజత పతకం, యస్.పి. క్రిష్ణ చైతన్య, 8వ తరగతి, బంగారు పతకం, జి. సాయి నంహిత్, 9వ తరగతి, బంగారు పతకం, పి. శ్లోక, 9వ తరగతి, రజత పతకం, యం. హిమేష్ చంద్ర, 10వ తరగతి, బంగారు పతకం, డి. ఉదయ శ్రీ, 10వ తరగతి, రజత పతకం, పతకాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు.