calender_icon.png 14 June, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి సేవా కార్యక్రమాలు చేయాలి

11-06-2025 07:44:23 PM

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ లో స్వర్గీయ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పేరు మీద నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి రోడ్డు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddyతెలుసుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ మినిస్టర్ క్వార్టర్స్ లో కలవడం జరిగింది. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ నమిండ్ల వెంకట్, వైస్ చైర్మన్ బిగుళ్ల సురేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసి వారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ నమిండ్ల వెంకటేష్, వైస్ చైర్మన్ బిగుళ్ల సురేష్, వర్ధన్నపేట సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్ట తిరుపతి, వర్ధన్నపేట యూత్ నాయకులు రేణుకుంట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.