గౌడ్ సమాజ అభ్యున్నతికి గోపా వేదికగా సేవలు
గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్
కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కామారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): గౌడ సమాజ అభ్యున్నతికి గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) ప్రతినిధులు కృషి చేయాలని డాక్టర్ బండి సాయన్న గౌడ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కామారెడ్డి జిల్లా గోప నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గోపా ఆధ్వర్యంలో సమాజ సేవలో మరింత చురుకుగా పనిచేసి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షునిగా రంగ వెంకటేశ్వర్లుగౌడ్, ఉపాధ్యక్షులుగా అంకన్న గారి నాగరాజు గౌడ్, అనుకూరి కృష్ణ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాబా గౌడ్, జాయింట్ సెక్రెటరీగా డాక్టర్ పల్సర్ హరీష్ గౌడ్, సుధీమ్ కృష్ణ గౌడ్, తిమ్మప్పల్లి శివ గౌడ్, కార్యదర్శులుగా చింతకింది స్వామి గౌడ్, పాత ఇంటి నరేందర్ గౌడ్, గట్టుపల్లి రేణుక గౌడ్, అరుణ గౌడ్, సలహాదారులుగా బోర్ర రాజా గౌడ్, కోడి ప్యాక నరేందర్ గౌడ్, జనగామ శ్రీనివాస్ గౌడ్, కార్యనిర్వక సభ్యులుగా మర్రిపల్లి స్వామి గౌడ్, దేవుళ్ళ ఎల్లా గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ గోప అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్, గోప రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హెల్మ కంటి, మీరయ్యగౌడ్, ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, ప్రదీప్ గౌడ్ నరేష్ గౌడ్, ఉప్పునూతల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






