22ఏ జాబితాపై చర్చకు ప్రభుత్వం సిద్ధం

08-09-2026 | 04:55am

బీజేపీ సభ్యులు సహకరించాలి

మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

స్పీకర్ చెప్పినా వినని బీజేపీ

22ఏ వాయిదా తీర్మానానికి పట్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): 22ఏపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) స్పష్టం చేశారు. బీఏసీ సమావేశంలో 22ఏ అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. 22ఏ పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని హామీ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని  చెప్పారు.

సోమవారం అసెంబ్లీ బయట బీఆర్‌ఎస్ శ్రేణుల వాగ్వాదంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. అంతలోనే బీజేపీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. 22ఏపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు.

దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ... రాజ కీయాల కోసం సభను అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్ ప్ర సాద్‌కుమార్ సర్దిచెప్పి నా.. బీజేపీ ఎమ్మెల్యేలు వినకుండా 22ఏ అంశంపై సిట్టింగ్ జ డ్జీతో విచారణ జరిపించాలని నినాదాలు చే శారు. పోడియం వద్ద బైఠాయించారు. రా ష్ట్రంలో జరుగుతున్న భూ దందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ స భ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను కొంతసేపు వాయిదా వేశారు. 

శ్రీపాదరావు పేరిట సెంట్రల్ హాల్..

శాసన సభా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ‘దుదిళ్ల శ్రీపాదరావు సెం ట్రల్ హాల్’ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమా ర్‌తో కలిసి  సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిం చారు. మాజీ స్పీకర్, దివంగత నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు జ్ఞాపకార్థం ఈ సెంట్రల్ హాల్‌కు ఆయన పేరు పెట్టారు.  

మరిన్ని వార్తలు