బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
జిల్లా కలెక్టర్ వినతిపత్రం
మ్యాకల పర్శరాములు
జిల్లా అధ్యక్షులు,జాతీయ బీసీ సంక్షేమ సంఘం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు డిమాండ్ చేశారు.పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. అయితే చాలా కాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక కాలేజీలు ఫీజులు చెల్లించలేదని చెప్పి విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ గడ్డం నరేష్, జిల్లా అధ్యక్షురాలు నాగారం కొమురవ్వ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మారావేణి మహేష్, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు చందనగిరి అఖిల, అర్బన్ అధ్యక్షురాలు మ్యాన సుమ, చొక్కాల నిరంజని తదితరులు పాల్గొన్నారు.




