నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి
06-03-2026 02:35 PM
బెజ్జూర్:(విజయక్రాంతి): బెజ్జూరు మండలంలోని సలువుపల్లి గ్రామంలో కిచెన్ సెడ్డు నిర్మాణ పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కిచెన్ షెడ్డు పనుల పరిశీలనను చూసి నాణ్యతతో పనులు చేపట్టాలని, పెట్టాల్సిన కిటికీలు, దర్వాజలు సరైన పద్ధతిలో లేకపోవడంతో పాటు నాణ్యతతో కూడిన పనులు చేపట్టకపోవడంతో వాటిని వెంటనే తొలగించాలని సంబంధిత కాంట్రాక్టర్, కార్యదర్శికీ సూచించారు.
కిచెన్ షెడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని నీరు సక్రమంగా అందించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని తెలిపారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. నిబంధనల ప్రకారం పనులు చేపట్టకపోతే మళ్లీ గోడలను తొలగించి పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. వారి వెంట కార్యదర్శి ఉన్నారు.




