సాగునీటిపై సర్కార్ నిర్లక్ష్యం

12-09-2026 | 04:55am

మోటార్లు ఆపితే రైతులతో కలిసి వంటావార్పు

కరెంట్ కోతలపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalwakurthy Lift Irrigation Scheme) మోటార్లను ఇష్టానుసారంగా ఆన్‌ఆఫ్ చేస్తూ రైతులకు సాగునీరు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరంహర్ష వర్ధన్ రెడ్డి తదితరులు మండిపడ్డారు. శుక్రవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథ కాన్ని పరిశీలించి, కరెంట్ కోతలతో మోటార్లను నిలిపివేస్తే రైతులతో కలిసి లిఫ్ట్ వద్ద వ ంటా వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు.

శ్రీశైలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎత్తిపోతలకు 24 గంటల విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నీటిని ఎత్తిపోయేందుకు 24 గంటల విద్యుత్ స రఫరా చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు ర ంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభు త్వం 90 శాతం పూర్తి చేసినా, కాం గ్రెస్ అధి కారంలోకి వచ్చిన మూడేళ్లలో కాల్వల నిర్మా ణంలో ఆశించిన పురోగతి లేదని ఆరోపిం చారు. ఆంధ్రప్రదేశ్ వైపు కృష్ణా జలాల తరలింపుపై ప్రభుత్వం స్పందించకుండా తెలంగాణ ప్రయోజనాలను విస్మరి స్తోందని విమర్శించారు.  


మరిన్ని వార్తలు