28 March, 2026 | 5:24 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని ప్రభుత్వాలు

08-10-2025 04:56 PM

హైదరాబాద్: తెలంగాణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు బీసీల 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ 9ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ బెట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖాలు చేశారు. అలాగే బీసీలకు అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి. హనుమంతరావుతో పాలు పలువురు బీసీ నేతలు పిటిషన్లు దాఖాలు చేశారు. బుధవారం బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. 

చట్టసభలు చేసిన చట్టాలను గవర్నర్లు త్రిశంకుస్వర్గంలో ఉంచతున్నారని సింఘ్వీ పేర్కొన్నారు. గవర్నర్లు బిల్లులపై నెలలపాటు ఏ నిర్ణయం చెప్పటం లేదు, బిల్లులను ఆమోదించట్లేదు, తిరస్కరించట్లేదు, తిప్పిపంపడంలేదు అని చెప్పారు. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా..? అని న్యాయవాది అడిగారు. గతంలో తమిళనాడులో ఒక బిల్లు ఐదేళ్లు గవర్నర్ వద్దే ఉందని, ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఏఎం సింఘ్వీ వెల్లడించారు. గవర్నర్లు నిర్ణయం తీసుకోకపోవటంతో వ్యవస్థ స్తంభించిపోతోందని, బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని, వారి చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయని  ఏఎం సింఘ్వీ వివరించారు.