తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవింద స్వాములు
సూర్యాపేట, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో గోవింద మాల దీక్షను స్వీకరించిన గోవింద స్వాములు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుమలకు గురువారం పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాను చక్రవర్తుల వేణుగోపాలచార్యులు పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు.
ప్రతి సంవత్సరం సూర్యాపేట నుండి పాదయాత్రగా భక్తులు వెళ్లడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా గోవింద మాల భక్తబృందం నిర్వాహకులు వారిని సూర్యాపేట పొలిమేర వరకు గోవింద నామస్మరణలు స్వామి వారి కీర్తనలు పాడుతూ సాగనంపారు. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన వారిలో మట్టా రమేష్ స్వామి, ఆవుల యాదగిరి స్వామి బాత్క ఈశ్వర్ స్వామి తదితరులు ఉన్నారు. కాగా ఈ యాత్రలో పాల్గొన్న స్వాములకు శివరాత్రి శ్రీను భిక్ష ఏర్పాటు చేశారు.




