‘హస్తం’ హవా..!
డబుల్ సెంచరీ క్రాస్
కరీంనగర్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 369 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలు పొందారు. కాంగ్రెస్ స్కోర్ డబుల్ సెంచరీ దాటింది. కరీంనగర్ అసెంబ్లీ, కోరుట్లలో కాంగ్రెస్ పర్వాలేదనిపించుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పలుచోట్ల బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
గతంలో ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో రెండు చోట్ల ఈటల రాజేందర్ బలపర్చినవారు కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం విశేషం. కరీంనగర్ జి ల్లాలోని 91 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా, చొప్పదండి మండలంలోని 15 పంచాయతీలలో 10, గంగాధరలోని 33 పంచాయతీల్లో 20, కరీంనగర్ రూరల్లోని 14 పంచాయతీల్లో 7, కొత్తపల్లి 6 పంచాయతీల్లో 3, రామడుగులో 23 పంచాయతీల్లో 15 పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గంలో ముత్తారం, మంథని, రానుగిరి, కమాన్పూర్, పెద్దపల్లి నియోజకవర్గంలోని శ్రీరాంపూర్లో ఎన్నికలు జరుగగా, మొత్తం జిల్లాలో 95 గ్రామ పంచాయతీల్లో 80 మంది వరకు కాంగ్రెస్ బలప ర్చిన అభ్యర్థులు గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజక ర్గంలో 95 వరకు కాంగ్రెస్, 15 బీఆర్‌ఎస్, 8 చోట్ల బీజేపీ, మిగతా చోట్ల స్వతంత్రులు గె లుపొందారు.
జగిత్యాల జిల్లాలో 118 గ్రా మాల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 70 వర కు పంచాయతీలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వార్డు సభ్యుల ఫలితాలను అనంతరం సర్పంచులు ఓట్ల లెక్కింపు నిర్వ హించారు. మేజర్ పంచాయతీ ఓట్ల లెక్కిం పు రాత్రి 11 గంటల వరకు కొనసాగింది.
- కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటిన బీజేపీ...
గతంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ బలం ఈ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మెరుగుగా అనిపించింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ విజయం సాధించారు. ఇతను కమలాపూర్ మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్ అనుచరులు బలపర్చిన సంపత్ ఓటమి పాలయ్యారు.
భీందేరపల్లి మండలం రసూల్ పల్లి, చందుర్తి మండలం కొత్తపల్లి, రామారావుపల్లి, వేములవాడ రూరల్ మండలం బొల్లారం, వెదు రుగట్ల, గంగాధర మండలం చెర్లపల్లి, కొం డాయిపల్లి, కోనరావుపేట మండలం అజ్మీర్ తండా, కొత్తపల్లి మండలం ఖాజీపూర్, కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
- కరీంనగర్ రూరల్ మండలంలో సత్తాచాటిన కాంగ్రెస్...
గతంలో కరీంనగర్ రూరల్ మండలంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తాచాటింది. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని నల్లగుంటపల్లి, తాహేర్ కొండాపూర్, చేగుర్తి, ఫకీర్పేట్, బహదూర్ ఖాన్ పేట, దుబ్బపల్లిలలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలు పొందారు.




