15 March, 2026 | 11:29 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం: కేటీఆర్

09-11-2024 11:23 AM

హైదరాబాద్: అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని పనుల టెండర్లు ద్వారా ప్రభుత్వ అవినీతి బయటపడిందని కేటీఆర్ ఆరోపించారు. ఎక్కువ కోట్ చేసిన అనుకూల కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ విమర్శించారు. రెండు కంపెనీలకు కట్టబెట్టడం అబద్ధమని ప్రజలు అనుకోరా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే రూ. 4,350 కోట్ల ప్రజాధనాన్ని కొందరికి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తమ కుబేరుల ఖజానాను నింపుకోవడం, తెలంగాణను తమ ఏటీఎంగా ఉపయోగించుకోవడంలో నిమగ్నమై ఉందని కేటీఆర్ ద్వజమెత్తారు.