4 September, 2026 | 5:31 PM

ఆరోగ్యంపై ఖర్చు 1.2 శాతం మాత్రమే

07-06-2024 | 02:19am

జయప్రకాష్ నారాయణ

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): దేశంలో ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించడం లేదని డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నైతిక వ్యాపార విధానాలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలో ఏటా వైద్యం కోసం చేసే ఖర్చుల ద్వారా 6.30 కోట్ల మంది మరింత పేదరికంలోకి వెళ్లిపోతున్నారని తెలిపారు. సరైన ఆరోగ్య సంరక్షణకే అవకాశం లేని ప్రజలు ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచన కూడా చేయలేరన్నారు. మన దేశం తన జీడీపీలో కేవలం 1.2శాతమే ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తోందని  అన్నారు.  విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం దేశం నిధులను ఖర్చు చేస్తున్నప్పటికీ దేశంలో అర్థవంతమైన ఫలితాలు రావడం లేదన్నారు. అందరికీ విద్య, ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల బాధ్య త అని పేర్కొన్నారు. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండి యా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేశ్ ఝా, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మీలా జయదేవ్ పాల్గొన్నారు.