పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
బడిబాటలో ఉపాధ్యాయుల పిలుపు
సిద్దిపేట రూరల్/సిద్దిపేట/ కొండపాక/రాజేంద్రనగర్/ఇబ్రహీంపట్నం జూన్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం నుంచి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట నియోజక వర్ంగలోని సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు మండలాల్లో ఉపాధ్యా యులు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి వివరించారు. ఇంగ్లీ ష్ మీడియంలో విద్య అందుబాటులో ఉంద ని తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, రెండు జతల దుస్తులు అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే దుద్దెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు.
రాజేంద్రనగర్ పరిధిలో..
రాజేంద్రనగర్ పరిధిలోని బాబుల్‌రెడ్డి నగర్ ఎంపీపీఎస్ హెచ్‌ఎం అనిత ఆధ్వర్యం లో బడిబాట నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
శంషాబాద్ మండలంలో..
శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో రంగారెడ్డి కలెక్టర్ శశాంక ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల విద్యార్థులు కార్తీక వీణ, అనుష్కను కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, శంషాబాద్ తహసీల్దార్ నాగమణి, ఎంపీడీవో మున్ని, సీడీపీవో షబానా, ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో..
ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. హెచ్‌ఎం సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మంచాల గ్రామంలో బడిబాటలో భాగంగా అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో సీఎంవో కృష్ణయ్య, సెక్టార్ ఆఫీసర్ వెంకటేశం, ఎంఈవో వెంకట్‌రెడ్డి, నోడల్ అధికారి రామదాసు, హెచ్‌ఎంలు ఝాన్సీ, సుగంధ పాల్గొన్నారు






