సీఎంవోకు అధికారుల బృందం
ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్టు స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనకు కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారుల నియామకాలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారి సాయి ప్రసాద్‌ను నియమించనున్నట్టు తెలిసింది. సీఎంవో ప్రిన్సి పల్ సెక్రటరీగా గిరిజా శంకర్, మరో ప్రిన్సిపల్ సెక్రటరీగా సిద్ధార్థజైన్‌ను నియమించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వానికి కండ్లు, చెవులుగా పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పీ బాలసుబ్రహ్మణ్యంను నియమించే అవకాశం ఉంది. మూడేండ్లుగా సెలవులో ఉన్న ఆయనను ఆగమేఘాలపై పిలిచినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వానికి కీలకమైన సీఎంవో అధికారులు నియామకం కాగానే ఒక్కో శాఖవారీగా సమర్థత, ప్రత్యేక వర్గాలకు పెద్దపీట ఉంటుందని చర్చ సాగుతోంది.






