09-06-2025 05:28:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో తెలంగాణ జపాన్ కరాటే అసోసియేషన్(Telangana Japan Karate Association) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి గ్రేడింగ్ పరీక్షలను సోమవారం నిర్వహించి వివిధ బెల్టులను ప్రధానం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు చేతేందర్ సింగ్ పాటియా ఆధ్వర్యంలో ఈ గ్రేడ్ పరీక్షలు నిర్వహించగా 100 మందికి గ్రేడింగ్‌లు ప్రకటించి బెల్టును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు స్వామి శ్రీకాంత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.