4 July, 2026 | 3:08 AM

ఘనంగా ‘మిషన్ భగీరథ’ జలోత్సవం

04-07-2026 02:26 AM

కడ్తల్ (ఎక్వాయిపల్లి), జూలై 3: గ్రామంలో మిషన్ భగీరథ జలోత్సవం (జల దినోత్సవం) వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక సర్పంచ్ పాలకుర్ల కర్ణరుణకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు మిషన్ భగీరథ డీ ఈ ఈ మోహన్ రెడ్డి, ఎ.ఇ,జయశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ శుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.

అనంతరం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను సర్పంచ్ కరుణాకర్ వివరించారు. ఈ వేడుకలో భాగంగా నీటి సంరక్షణపై గ్రామస్తులందరితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో  నాయకులు సుమన్, రాజు, శాంతయ్య, జంగయ్య, మల్లయ్యతో పాటు పంచాయతీ కార్యదర్శి నిరంజన్, జీపీ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.