శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
20-03-2026 12:00 AM
మఠంపల్లి, మార్చి 19 : మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రములో గురువారం తెలు గు సంవత్సరాది అనగా ఉగాది పరాభవ నామ సంవత్సరంను పురస్కరించుకొని శ్రీ స్వామివారికి ప్రాతః కాలం ప్రత్యేక పూజ లు, అభిషేకములు, విశేష అర్చనలు దేవాలయ అర్చకులచే నిర్వహించబడినది.
సాయం త్రం 5 గంటల నుండి పంచాంగ శ్రవణము కార్యక్రమం అత్యంత వైభవముగా నిర్వహించబడినది.తదుపరి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు,అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.




