10 June, 2026 | 2:41 AM

అంగరంగ వైభవంగా కల్కి భగవతి, భగవానుల కళ్యాణ మహోత్సవం

10-06-2026 01:31 AM

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

500ల మందికి అన్న ప్రసాద వితరణ

కామారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  కల్కి ఆలయంలో  కల్కి భగవతి, భగవానుల కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు,500 ల మంది ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ భగవానుల ఆశీర్వాదాన్ని స్వీకరించారు,అన్న ప్రసాద వితరణ,కళ్యాణ కార్యక్రమాలకు సహకరించిన దాతలకు ఆశీర్వచనాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,ఎర్రం విజయ్, డాక్టర్ బాలు, సిద్ధంశెట్టి శ్రీనివాస్,పార్శి శ్రీనివాస్, పాత స్వరూప, పప్పుల రాజు శ్రావణి, పబ్బ స్వప్న వేణు,ఎర్రం ప్రసన్న, నాగరాణి, కొమిరిశెట్టి దిగంబర్ పావన, కస్వ వెంకటేష్, శనిశెట్టి శ్రీనివాస్ పద్మ, ఎల్లంకి సుదర్శన్, నంగునూరి కాశీనాథం, జైపాల్ రెడ్డి,లక్ష్మీ రాజం, దోమకొండ శ్రీనివాస్, కళ్ళెం సత్యం, కుంభాల లక్ష్మణ్ యాదవ్ లు పాల్గొన్నారు.