మాజీ మంత్రి హరీష్‌రావుకు ఘన స్వాగతం
13-06-2026 12:00 AM
కోహెడ, జూన్ 12 : కోహెడ మండలం సముద్రాల క్రాసింగ్ వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు బిఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం ఫలికారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ నియోజకవర్గం సమావేశానికి వెళుతున్న క్రమం లో మర్యాద పూర్వకంగా శాలువ కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా హరీష్ రావు.. నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం కొక్కుల సురేష్, తిప్పారపు శ్రీకాంత్, పొన్నాల లక్ష్మయ్య, పండుగ శ్రీకాంత్, గవ్వ కిషన్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, జాలిగం శంకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.






