60 మంది ఉల్లం‘ఘనులు’
- ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో పట్టుబడిన 38 మంది..
- వితౌట్ లైసెన్స్ కేసులో మరో 22 మంది..
సిద్దిపేట క్రైం, జూన్ 12 : సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 60 మందికి న్యాయమూర్తి శుక్రవారం జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ ముత్యం రాజు తెలిపారు. కొన్ని రోజుల క్రితం పట్టణ పరిసర ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయగా 38 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు బ్రీత్ ఎనలైజర్ తో గుర్తించామని పేర్కొన్నారు.
వారిని శుక్రవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరచగా, విచారణ జరిపి 38 మందికి కలిపి రూ. 3 లక్షల 12 వేల 5 వందల జరిమానా విధించారని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 22 మందిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్టు చెప్పారు. వారందరికీ కలిపి రూ. లక్షా 5 వేల 5 వందల జరిమానా విధించారని ఇన్స్పెక్టర్ సీహెచ్ ముత్యం రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు.






