మనవడిని కాపాడబోయి తాత మృతి
- బోరు బావిలో పడిన బాలుడు
- ఉట్లపల్లి గ్రామ శివారులో ఘటన
మిర్యాలగూడ, మే 16 (విజయక్రాంతి) : బోరు బావిలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాపాడడానికి ప్రయత్నించిన తాత మృతి చెందిన హృదయ విదారక సంఘటన మిర్యాలగూడ మండ లం ఉట్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివా రం ఉదయం మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లికి చెందిన చిమట వెంకన్న(53) ఏడేళ్ల మనుమరాలిని, నాలుగు సంవత్సరాల మనవడిని తీసుకొని తన పొలం వద్ద కు వెళ్లాడు.
ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. ఇది గమనించిన బాలుడి అక్క తాత వెంకన్నకు తెలియజేయడంతో వెంటనే మనవడిని కాపాడే క్రమంలో ఆయన కూడా తలకిందులుగా బోరుబావిలో పడిపోయాడు. దీంతో మనుమ రా లు పక్కనే ఉన్న రోడ్డు మీద కు పరిగెత్తి ప్రయాణికులకు విషయం తెలియజేసింది.
వెంటనే బోరుబావి దగ్గరకు చేరుకున్న కొందరు తీసే ప్ర యత్నం చేసినప్పటికీ ఫలి తం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారన్నారు. సంఘటన స్థలా నికి చేరుకున్న రెస్క్యూటీమ్ చాకచక్యంగా వెంకన్నని, బాలుడిని బోరిబావిలో నుంచి తీశారు. అప్పటికే సోమ్మసిల్లిపోయిన వెం కన్న చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. బాలుడికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






