15 July, 2026 | 1:55 AM

గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశం

05-07-2024 12:03 PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితి నేతలు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మాగంటి గోపినాథ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.