విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్.. ఖండించిన కేటీఆర్
05-07-2024 12:28 PM
హైదరాబాద్: టీజీఎస్పీసీని ముట్టడించి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్‌వీ కార్యకర్తలు, నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యార్థుల శాంతియుత నిరసన పైన ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిం చిందని ఆరోపించారు. అరెస్టు చేసిన విద్యార్థి సంఘాల నాయకులను నిరుద్యోగులను యువకులను భేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.






