27న వస్తున్న ‘డ్రింకర్ సాయి’
06-12-2024 12:00 AM
ధర్మ, ఐశ్వర్యశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొం దింది. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవ రాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ సంయుక్తంగా నిర్మిస్తు న్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. పోసాని కృష్ణమురళి, సమీర్, ఎస్‌ఎస్ కాంచి, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, కిర్రాక్ సీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. బుధవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.






